
621views
భారత ప్రతిష్ఠాత్మక అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ ‘చంద్రయాన్-2’ఈ నెల 15న ప్రయోగించాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. తిరిగి ఈనెల 22, సోమవారం నాడు నిర్వహించనున్నట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది. జూలై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2 రాకెట్ ప్రయోగం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, రాకెట్ లో కనుగొన్న సాంకేతిక లోపాలను ఇప్పటికే సవరించామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దఫా ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చంద్రయాన్ 2 ప్రయోగం జరగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు.
Source : Bharath Today





