
దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ కుమారుడు రిజ్వాన్ కస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దేశం విడిచి పారిపోతున్న అతణ్ని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. థానే జైలుకు తరలించారు.
ఛోటా షకీల్ దగ్గరి బంధువులు, అతని ప్రధాన అనుచరులను అరెస్టు చేసిన 48 గంటల వ్యవధిలోనే ముంబై పోలీసులు రిజ్వాన్ కస్కర్‌ను అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తామని కొంతమంది బిగ్ షాట్‌లను బెదిరించి, లక్షల రూపాయలను అక్రమంగా వసూలు చేసిన కేసుల్లో రిజ్వాన్ కస్కర్ అరెస్టు అయ్యాడు. అతనిపై ముంబైలోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. తన చుట్టు ఉచ్చు బిగించుకుంటుండటంతో అప్రమత్తమైన రిజ్వాన్ బుధవారం రాత్రి దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించాడు. మారువేషంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. థానే జైలుకు తరలించారు. రెండు కిందటే ఛోటా షకీల్ అనుచరులను కూడా కటకటాల వెనక్కి నెట్టారు. ఛోటా షకీల్ కుడిభుజంగా చెప్పుకొనే అఫ్రోజ్ వడారియాను వలపన్ని మరీ పట్టుకున్నారు. అతణ్ని కూడా ముంబై విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు.
Source : One India.





