News

గిరిజన గ్రామాల్లో అయోధ్య రాముని అక్షతల ఊరేగింపు

350views

జనవరి 22న అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని అక్కడ నుంచి వచ్చిన అక్షతలు, ఆహ్వాన పత్రికలు, చిత్రపటాలను గిరిజన గ్రామాల్లో భక్తులు ఊరేగిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్‌, సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చింతపల్లి మండలం చినబరడ, రైతుబయలు, దోమలగొంది, చెరపల్లి, కొమ్మంగి, బైలుకించంగి, తెరపల్లి, కొత్తపాలెం గ్రామాల్లో ఆదివారం ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ మండల ధర్మప్రచారక్‌ సింహాచలం, సమరసత సేవా ఫౌండేషన్‌ మండల సహ కన్వీనర్‌ వెంకటరమణ పాల్గొన్నారు.