
281views
హిందూధర్మాన్ని పరిరక్షించాలని ఆనంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి పిలు పునిచ్చారు. విజయనగరం జిల్లా ఎల్.కోటలో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మానవాళిని జీవనవిధానంలో మార్పు తీసుకు వచ్చేందుకు మహిళలు నడుంబిగించాలని కోరారు. గాడి తప్పుతున్న యువకులను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తొలుత మహిళలు కోలాటం, నృత్యంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, కరెడ్ల ఈశ్వరరావు, కొరుపోలు అప్పారావు, హిందూ ధార్మిక సమ్మేళన నిర్వాహకులు ఎంవీ గోవింద, భాస్కరరావు పాల్గొన్నారు.





