News

ముంబై నుంచి అయోధ్యకు రామభక్తుల పాదయాత్ర

207views

నిర్మాణం పూర్తయ్యాక అయోధ్య నగరం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ప్రధానమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కృతజ్ఞతలు తెలిపారు.ముంబై నుంచి 47 రోజుల పాటు అయోధ్యకు పాదయాత్ర చేపట్టిన 300 మంది భక్తులను ఉద్దేశించి ఆదివారం శిందే మాట్లాడారు. కోట్ల మంది భారతీయుల కలలను సాకారం చేయాలన్న సంకల్పంతో రామమందిర నిర్మాణానికి పూనుకున్న ప్రధాని మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు.

అయోధ్యకు పాదయాత్ర చేపట్టిన భక్తులకు రామమందిర నిర్మాణం పట్ల భక్తిభావన, శ్రద్ధాసక్తులకు ఈ పాదయాత్ర నిదర్శనంగా నిలుస్తుందన్నారు. . జనవరి 22న నిర్వహించే ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు శిందే చెప్పారు.