
ఆకాశాన్ని వీక్షించేవారికి ఈ నెలలో ఒక విశేషం కనువిందు చేయనుంది. భారతీయ పంచాంగం ప్రకారం.. కర్కాటక రాశిలో గురు (జూపిటర్), శుక్ర (వీనస్) గ్రహాలు అతి దగ్గరగా రానున్నాయి. పాశ్చాత్య జోస్యులు శుక్రుని శృంగార దేవత వీనస్ గా పరిగణిస్తారు. భారతీయ జ్యోతిషం ప్రకారం చూసినా శుక్రుడు స్త్రీ గ్రహం.. గురుడు పురుష గ్రహం. అందుకే రాబోయే గురు, శుక్ర సంగమాన్ని విశ్వ చుంబనంగా అభివర్ణిస్తున్నారు. మన కంటికి కనిపించే ఖగోళ వస్తువుల్లో గురు, శుక్ర గ్రహాలు చాలా ప్రకాశ వంతమైనవి. ఈ రెండు గ్రహాల ఖగోళ సామీప్యత ఈ నెల 8, 9 తేదీల్లో స్పష్టంగా కనిపి స్తుంది. జూన్ 11 నుంచి 15 వరకు బుధుడు కూడా ఈ జంటతో కలుస్తాడు. పశ్చిమ ఆకాశం దిగువభాగంలో ఈ మూడు గ్రహాల సంగమాన్ని చూడవచ్చు. బుధుడు దిగంతానికి చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి, ఆ చిన్ని గ్రహాన్ని గుర్తించడం కష్టం కావచ్చు. భూమి నుంచి చూస్తే మన కళ్లకు శుక్రుడు, గురుడు దాదాపు పక్కపక్కనే ఉన్నట్లు అనిపించినప్పటికీ, అంతరిక్షంలో వాటి మధ్య కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది.భారతీయ పంచాంగం ప్రకారం.. కర్కాటక రాశిలో అతి దగ్గరగా రానున్న గురు, శుక్ర గ్రహాలు





