
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుఫాన్ ప్రభావంతో నెల్లూరుజిల్లా లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. తుపాను తీవ్రత అధికంగా ఉండటంతో రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ సేవా సమితి సేవా భారతి , ఫౌండేషన్ కార్యకర్తలు బాధితులను ఆదుకుంటున్నారు.
నెల్లూరు సేవా భారతి ఆధ్వర్యంలో మండేవారిపాలెంలోని తుఫాన్ సహాయ పునరావాస కేంద్రంలో పునరావాసితులకు మంచినీరు, ఆహార పొట్లాలు అందజేస్తున్నారు.సేవా భారతి నెల్లూరు జిల్లా మిచాంగ్ తుఫాన్ 4వ తేది రాత్రి వరదల్లో మునిగిన సేవా బస్తీలలో 5వ తేది ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముంపుకు గురైన సుమారు 10 సేవా బస్తిలలో 3000 మందికి భోజనం, అల్పాహారం అందజేశారు.
కాగా బాపట్ల సేవా భారతి ఆధ్వర్యంలో తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న కాజీపాలెం అయోధ్య కాలనీలో 70 మందికి భోజనం అందించారు.
అలాగే రహదారులకి ఇరువైపులా అడ్డంగా ఉన్నటువంటి చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో స్వయం సేవకులు, సేవా భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.
వివిధ ప్రాంతాలలోని వారికి సహాయం అందించటం కోసం సేవాభారతి వారి ఆధ్వర్యంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ ను ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నంబర్ కు ఎవరైనా ఫోన్ చేసి తమ ప్రాంతంలోని సమస్యల గురించి తెలియజేస్తే అందుకు తగినట్లుగా వారికి సహాయం అందిస్తున్నారు.