News

ఆంధ్రా తీరంలో క్రైస్తవ మత ప్రచారం, కార్తీక సముద్ర స్నానాలకు వచ్చే హిందూ భక్తులే టార్గెట్ !

84views

దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటోందనే విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కడప నుంచి కర్నూలు జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా మత ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు తీర ప్రాంతాన్ని టార్గెట్ చేసి క్రైస్తవ మిషనరీలు, సంస్థలు, సంఘాలు చేస్తున్న మత ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. హిందూ పండుగలు,పర్వదినాలను లక్ష్యంగా చేసుకుని క్రైస్తవ సంఘాలు సాగిస్తున్న మత ప్రచారంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హిందువులంతా కార్తీక మాసాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు. అ పరమేశ్వరుడిని ప్రార్తిస్తూ నదులు, సముద్ర జలాల్లో పవిత్రకార్తీక స్నానాలను ఆచరిస్తున్నారు. దీంతో.. సముద్ర తీరాలకు కార్తీక స్నానాలకు వచ్చే హిందూభక్తులను క్రైస్తవ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి.ఇప్పటికే తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న చర్చిలను కేంద్రంగా చేసుకుని మత ప్రచారానికి పాల్పడుతున్నాయి.

కార్తీక స్నానాలకు వచ్చే భక్తులకు అది ఇస్తాం..ఇది ఇస్తాం అంటూ ఫ్లెక్సీలు కడుతున్నాయి. ఆ ఫ్లెక్సీలో తమ సంఘాల పేర్లను తాటికాయంత సైజులో ముద్రిస్తున్నాయి. మహిళలు, పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నట్టుగా నటిస్తూ.. తమ క్రైస్తవ మత ప్రచారాన్ని యధేచ్చగా కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు బంగాళాఖాతం తీరంలో ఉన్న వందలాది బీచ్‌లను అడ్డాగా చేసుకుని.. క్రైస్తవ సంఘాలు ఈ దురాగతాలకు పాల్పడుతున్నాయి.

కార్తీక స్నానాలు, వన సమారాధానలకు వస్తున్న హిందూ భక్తులను లక్ష్యంగా చేసుకుని పాలు,బిస్కెట్లు, బైబిళ్లు పంచటం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి. తమ దేవుడిని నమ్మాలంటూ బలవంతం చేస్తున్నాయి. వాస్తవంగా.. ఒక మతానికి మత ప్రచారం చేయటం చట్టరీత్యా నేరం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం క్రైస్తవ సంఘాలు చట్టాల్ని చట్టబండలు చేస్తున్నాయి. యధేచ్చగా హిందువుల్ని, హిందూ పర్వదినాల్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా కార్తీక మాసంలో జరిగే.. పవిత్ర సముద్ర స్నానాల్ని సైతం ఆ మూకలు టార్గెట్ చేయటంతో.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆర్‌ఎస్‌ఎస్ తో పాటు పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి.

Source : Ritam తెలుగు