News

దేవాదాయశాఖ ఉద్యోగులు హిందూ మతాన్ని పాటించాల్సిందే : హైకోర్టు

103views

శ్రీశైలం దేవస్థానంలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేసిన పి. సుదర్శనా బాబు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం, క్రైస్తవాన్ని ఆచరించినట్లు విచారణలో తేలడంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఈవో 2012లో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. హిందూమత సంప్రదాయం పాటించని/ఆచరించని ఉద్యోగులను తొలగించే అధికారం భారత రాజ్యాంగ అధికరణ 16(5), ఏపీ ఛారిటబుల్, హిందూ రిలిజియస్ ఇన్స్టిట్యూ షన్స్, ఎండోమెంట్ ఆఫీసు హోల్డర్, సర్వెంట్ సర్వీసు రూల్ 3 ప్రకారం దేవాదాయ డిప్యూటీ కమిషనర్, శ్రీశైల దేవస్థానం ఈవోకు ఉందని తేల్చిచెప్పింది.

దేవాదాయశాఖ ఉద్యోగులు హిందూ మతాన్ని పాటించాల్సిందే

ధార్మిక సంస్థలు, దేవాదాయ శాఖ ఉద్యోగులు హిందూమతాన్ని ఆచరించాల్సి ఉంటుందని తెలిపింది. రూల్ 3 ప్రకారం శ్రీశైల దేవస్థానం ఉద్యోగులు హిందూతత్వం (హిందూ యిజం) తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఏ ఉద్యోగి అయినా హిందూ కాకుండా ఇతర మతాల్లోకి మారినప్పుడు ఉద్యోగిగా బాధ్యత నిలిచిపోతుందని స్పష్టం చేసింది. అధికరణ 16(5), ఏపీ చారిటబుల్ సర్వెంట్ సర్వీసు నిబంధన 3 కల్పించిన అధికారానికి లోబడి పిటిషనర్ను ఉద్యోగం నుంచి ఈవో తొలగించడం సరైనదేనని తెలిపింది. తనను ఉద్యోగంలోకి తిరిగి తీసుకునేలా అధికారులను ఆదేశించాలంటూ సుదర్శన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు వెలువరించారు.