ArticlesNews

కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు

57views

శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.. ఈ మాసంలో స్త్రీ, పురుషులనే బేధం లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. కాగా ఈ మాసంలో నదీస్నాలు, దీపారాధన, ఉపవాసాలు, వనభోజనాలు, ఇలా చాలా ఆచారాలను అనాదిగా పాటిస్తున్నారు. అయితే ఈ మాసంలో పాటించే ప్రతి ఆచారం వెనుక సైన్స్ దాగి ఉంది. కార్తీక మాసం లో ఆచరించే ప్రతి నియమం మన ఆరోగ్యాన్ని మేరుపరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ ఆచారాల వెనుక దాగిన ఆ నిగూడ శాస్త్రీయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక మాసం అనే కాదు హిందూ ధర్మంలో ఏ పండుగను ఆచరించిన మొదటగా గుమ్మానికి మామిడాకు తోరణాలు కడతారు. ఇలా మామిడాకు తోరణాలు కట్టడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది అంటారు. అయితే లక్ష్మి అంటే సంపద మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. చెట్టు నుండి తెంపిన తరువాత కూడా మామిడాకులకు కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వదిలే శక్తి ఉంది. కనుక మామిడాకులను గుమ్మానికి కడితే అవి కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను మనకు అందిస్తాయి. అందుకే తోరణాలను కడుతారు.

అలానే నేతి దీపాలు వెలిగించడం వల్ల గాలిలో ఆక్సీజన్ శాతం పెరుగుతుంది. ఆ గాలిని పీల్చ్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకే ఇంట్లోను గుడి లోనూ నేతి దీపాలను వెలిగిస్తారు. ఇక పసుపులో యాంటీబ్యాక్టీయిల్ గుణాలు ఉంటాయని అందరికి తెలిసిందే అయితే చలికాలంలో కాళ్ళు ఎక్కువగా పగులుతుంటాయి. అయితే ఇలా పసుపు రాసుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళ నుండి ఉపశమనం లభిస్తుంది. అదే మహిళలు కాళ్ళకు పసుపు రాసుకోవడం వెనుక దాగి ఉన్న రహస్యం.

అలానే ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. దీనికి కారణం ఉసిరి చెట్టులో ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.ఇలా ఉసిరి చెట్టు కింద కూర్చొని తినే సమయంలో ఆ చెట్టు ఆకులు పైన రాలుతుంటాయి. అలా పైన రాలిన ఆకుల్లోని ఔషధ గుణాలను శరీరం గ్రహిస్తుంది. అలానే ఇలా కలిసి భోజనం చేయడం వల్ల మానవ సంబంధాలు కూడా బలపడతాయి. అలానే ఉపవాసం చేయడం వల్ల శరీరం లో క్లెన్సింగ్ ప్రక్రియ జరిగి విషపదార్థాలు తొలగిపోతాయి. ఫలితంగా శరీరానికి చురుకుదనం, ఉత్సాహం, శక్తి అందుతాయి. ఇక మాసం తినక పోవడానికి కారణం.. ఈ మాసం లో వేడి తీవ్రత తక్కువగా ఉంటుంది. కనుక మాంసాహారం త్వరగా జీర్ణం కాదు. అందుకే ఈ మాసంలో సాత్విక ఆహరం అంటే కూరాయగలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు.