ArticlesNews

హిందూ సంస్కృతిలో యజ్ఞం లేదా హోమం చేయడంలో శాస్త్రీయ ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

231views

హిందూ సంస్కృతిలో యజ్ఞం లేదా హోమం చేయడం అనేది. ప్రాచీన కాలం నుండి వస్తున్న సంప్రదాయం. పవిత్రమైన అగ్ని ముందు మంత్రాలతో చేసే సర్వసాధారణమైన ఈ పురాతన ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది.

యజ్ఞం అనేది నీటి ఘనీభవనం యొక్క సహజ ప్రక్రియ, ఇది మేఘాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. వర్షాలు కురిపించి సర్వ జీవరాశిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది.

యజ్ఞ సమిధలుగా ఉపయోగించే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఔషధ గుణాలు కలిగిన చందనం, వేప, మామిడి, రావి, మర్రి వృక్షాల కొమ్మలను అగ్నికి ఆహుతి చేసినప్పుడు సహజ వాయువు ఉత్పత్తి అవుతుంది. తద్వారా వృక్షాల నుంచి ప్రాణికోటికి ఆధారభూతమైన ప్రాణవాయువు అధికంగా విడుదల అయ్యి వర్షాన్ని కురిపిస్తుంది.

యజ్ఞంలో ఉపయోగించే వైద్య మూలికల కారణంగా, ఫార్మిక్, ఎసిటిక్ ఆమ్ల వాయువులను ఉత్పత్తి అవుతాయి. ఈ ఆమ్లాలు క్రిమి సంహారకాలుగా పని చేసి వాతావరణంలోని హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి ఆరోగ్యకరమైన, రోగ క్రిమి నాశక వాతావరణాన్ని ఏర్పరుస్తాయి.

ఈ ప్రక్రియ ద్వారా మానవ ఆరోగ్యానికి కూడా భారీ ప్రయోజనం చేకూరుతుంది. అగ్ని నుంచి వెలువడే పొగలు మెదడు కణాలను పునరుద్ధరిస్తాయి, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలాగే వ్యాధికారక జీవుల పెరుగుదలను నిరోధిస్తాయి.ఈ మొత్తం ప్రక్రియ మానవులలో శుద్ధీకరణ జరగడమే కాకుండా శక్తిని ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలోనూ సహాయపడుతుంది.

నేటి వైజ్ఞానిక ప్రపంచం యొక్క మూలాల సాధికారత వేదాల ద్వారానే సాధ్యపడింది.