
ప్రతి సంవత్సరము వైశాఖ బహుళ పాడ్యమి నాడు నారద జయంతి కార్యక్రమాన్ని భారత్ ప్రకాశన్ ట్రస్ట్ జరుపుతోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో నారద జయంతి కార్యక్రమం జరిగింది. వాటిలో మనకు సమాచారం అందిన కొన్ని కార్యక్రమాల వివరాలివీ…
నంద్యాల నగరంలో…

పత్రికా రంగంలో పేపర్ ఏజెంట్ (పేపర్ డిస్టుబ్యూషన్) గా చాలా సంవత్సరాల నుండి ఉంటూ ఇప్పటికీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో సైకిల్ పై పేపర్ ఇంటింటికీ వేస్తూ ఉన్న శ్రీ వెల్లుకొండయ్య (నంద్యాల బస్టాండ్ ఎదురుగా ఉన్న చిన్న షాప్) గారిని నారద జయంతి పురస్కరించుకుని సన్మానించడం జరిగింది. వారు దాదాపు గా 1967 నుండి అన్ని దినపత్రికలును ఇప్పటికీ ఇంటింటికీ తిరుగుతూ పాఠక ప్రియులకు అందిస్తూ వారి అభిమానాన్ని పొందుతున్నారు. ఐదు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా తన సేవలందిస్తున్న శ్రీ వెల్లు కొండయ్యను ఈ రోజున సన్మానించుకోవడం చాలా సంతోషంగా వుంది అని శ్రీ చింతలపల్లె వాసు తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, శ్రీ రామాంజనేయులు, శ్రీ సురేంద్ర, శ్రీ వేణుగోపాల్ పలువురు Rss స్వయం సేవకులు పాల్గొన్నారు.
నంద్యాల సంఘమిత్రలో…
సమాజంలో చైతన్యం కలిగించి మేల్కొలపగలిగే శక్తి సమాజంలో మంచి చెడులు తెలిజేసి సమాజ హితం కోరుకునేదే పత్రిక రంగం(జర్నలిజం) అని ప్రముఖ వైద్యులు డా||గెలివి సహదేవులు అన్నారు.

భారత్ ప్రకాశన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 19-5-2019 ఆదివారం ఉదయం 10:00 సంఘమిత్ర నందు శ్రీ నారద జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా డా|| ఉదయ శంకర్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము వైశాఖ బహుళ పాడ్యమి నాడు మనం నారద జయంతి జరుపుకుంటాం. తొలి పాత్రికేయుడు దేవర్షి నారదడు అని అన్నారు. పాత్రికేయులు సమాజాన్ని జాగృతం చేసే గురుతర బాధ్యత మోస్తున్నారన్నారు. నారదుని జయంతి అయిన ఈ రోజున మనం పాత్రికేయులందరినీ కలుపుకొని గౌరవించుకుంటాం అని అన్నారు. ముఖ్య వక్త రామకృష్ణ గారు మాటలాడుతూ నేటి యుగంలో అన్నికంటె ప్రభావవంతగా పనిచేసే ప్రచార మాధ్యమంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సామజిక మాధ్యమాలు, కంప్యూటర్ ద్వారా ఇంటర్ నెట్ వేగంగా సమాజం లోని వెళ్తున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా డా.ఉదయ శంకర్ గారు(RSS సహా సంఘచాలక్),ముఖ్య అతిధి డా. గెలివి సహదేవులు గారు(ప్రముఖ వైద్యులు),ముఖ్య వక్త రామకృష్ణ గారు (సామాజిక సేవా కార్యకర్త),విచ్చేశారు. సీనియర్ పత్రిక విలేకరులు శ్రీపాశం వెంకటేశ్వర్లు, శ్రీ జనార్దన్ రెడ్డి, శ్రీ పసుపులేటి జనార్దన్, శ్రీ శశి శేఖర శర్మ, శ్రీ శ్రీనివాసులు, శ్రీ కనక రాజు, శ్రీ కిషోర్ లను ఈ సందర్భంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విలేకరులు శ్రీ కంభం సతీష్ కుమార్, శ్రీ హేమంత్ కుమార్, శ్రీ నాగప్రసాద్, శ్రీ శ్రీనివాసులు, శ్రీ కిషోర్, శ్రీ డీలర్ శీను, శ్రీ శివరాం, శ్రీ సుధాకర్, శ్రీ చింతల పల్లి వాసు, శ్రీ నంది కుమార్, శ్రీ రాజేష్, శ్రీ బాష, శ్రీ రవికుమార్, శ్రీ సాయి, శిల్పా టీవీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరులో…

సమాజాన్ని మేల్కొలపగలిగే శక్తి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడేది జర్నలిజం మాత్రమేనని నెల్లూరులోని ప్రముఖ వైద్యులు డా|| C.V. సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం స్థానిక జయభారత్ హాస్పిటల్లో భారత ప్రకాశన్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నారద జయంతి ఉత్సవంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారదుడు కలహభోజుడు కాదని అన్ని లోకాలలో జరుగుతున్న సంఘటనలను అందరికీ తెలియజేసేవాడు నారదుడని అన్నారు. అందువలన ఆయనను సృష్టిలో మొట్టమొదటి జర్నలిస్టుగా గుర్తించడం జరిగిందని అన్నారు. ఎంతోమంది జర్నలిస్టులు తమ వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి తమ విధులు నిర్వహిస్తున్నారన్నారు. APUWJ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎ. జయప్రకాశ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు విధి నిర్వహణలో మృతి చెందారని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాజకీయాలు, ఉద్యోగాలు, ఇతర సంస్థలలో లాగానే జర్నలిజంలో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నంత మాత్రాన ఈ వ్యవస్థను నిందించరాదన్నారు. నేటికీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది మీడియా మాత్రమే అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టులు ఈతకోట సుబ్బారావు, P. రాజశేఖర్, మద్దూరి శ్రీనివాసులు లను ఘనంగా సన్మానించారు. శ్రీ గుర్రం సుధాకర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ఆరెస్సెస్ విభాగ్ సంఘచాలక్ శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, జయభారత్ హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్, ఆరెస్సెస్ నగర ప్రచార ప్రముఖ్ శ్రీ దోర్నాదుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.





