
2.4kviews

శ్రీ శారదా విద్యా పీఠం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, ఫారూఖ్ నగర్, నంద్యాల ఆధ్వర్యంలో డా||N.C. లక్ష్మయ్య ప్రముఖ కంటి వైద్య నిపుణులు గారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ శ్రీ దామోదర్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీ శశి కుమార్, రోగులకు బిపి మరియు షుగర్ పరీక్షలు నిర్వహించారు. ప్రారంభకార్యక్రమంలో డా|| గెలివి సహాదేవుడు, శ్రీ వై.రాంప్రసాద్, శ్రీ గోళ్ళ సుదర్శనం, శ్రీ మూటాల నాగరాజు, శ్రీ మురళి కృష్ణ పాల్గొన్నారు. డా||లక్ష్మయ్య కంటికి సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ వైద్య శిబిరంలో 125 మందికి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి కంటి అద్దాలు కూడా ఇస్తామని డా||లక్షయ్య తెలిపారు.






