
314views
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేకోత్సవాల్లో భాగంగా స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారి మూలవిరాట్టుకు సంప్రదాయబద్ధంగా పంచామృతాభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి సిద్ధిబుద్ధి సమేతుడైన గౌరీ తనయుడి ఉత్సవమూర్తులను సర్వాలంకృతులు చేసి అలంకార మండపం వద్ద నివేదన సమర్పించి… సూర్యప్రభ వాహనంపై ఉంచి ఊరేగించారు.




