News

వినాయక నిమజ్జనాలపై ముంబై పోలీసుల వివక్ష

291views

ముంబైలో ఈద్ ఊరేగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోలీసులు లౌడ్ స్పీకర్లను అనుమతించారు. అదే ముంబైలో ఆరోజే జరిగిన వినాయక నిమజ్జనాల సమయంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించి నిబంధనలను ఉల్లంఘించారని గణేశోత్సవ మండపాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

నిమజ్జన ఊరేగింపులో హిందువులపై చర్య తీసుకున్న ముంబై పోలీసులు ఈద్-ఎ-మిలాద్ సమయంలో ముస్లింలను లౌడ్ స్పీకర్లను DJలను ఉపయోగించడానికి అనుమతించి.. హిందువుల పట్ల వివక్ష చూపారు.

స్థానికంగా అందిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 28 న జరిగిన వినాయక నిమజ్జనాల ఊరేగింపులో లౌడ్ స్పీకర్లు, DJ ఉపయోగించినందుకు పోలీసులు గణేష్ మండళ్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి.. వారిపై చర్యలు తీసుకున్నారు. మండపాలలో లౌడ్ స్పీకర్లను తొలగించేలా చేశారు.

మరోవైపు, ఈద్-ఎ-మిలాద్ ఊరేగింపు సందర్భంగా ముస్లింలు లౌడ్ స్పీకర్లను మరియు DJలను ఉపయోగించడానికి అనుమతించారు.

రాత్రి 10 గంటలు దాటితే లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని సుప్రీమ్ కోర్ట్, ముంబై హైకోర్ట్ ఉత్తర్వులను చూపుతూ పలు గణేశ మండపాలకు పోలీసులు నోటిసులు ఇచ్చారు. అయితే ఈద్ పండగనాడు ముస్లింలు లౌడ్ స్పీకర్లకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులు పట్టించుకోలేదు. ముస్లింలు DJ సంగీతాన్ని ప్లే చేయడమే కాకుండా..ఫిర్యాదులు ఉన్నప్పటికీ ముస్లింలకు వ్యతిరేకంగా పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా హిందువులపై వివక్ష ప్రదర్శించారని పలువురు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.