News

కెనడాలో ‘కైలాసం’.. గణేశ మండపానికి విదేశీయుల​ క్యూ!

316views

కెనడాలో మధ్యప్రదేశ్ కి చెందిన​ దంపతులు ప్రఖ్యాత ఎల్లోరా కైలాశ్​ గుహ నమూనాలో గణేశ్​ మండపాన్ని ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు నెలల పాటు శ్రమించి.. ఈ నమూనాను రూపొందించారు. దీనిని చూడడానికి భారతీయులతో పాటు కెనడా దేశస్థులు సైతం వస్తున్నారని ఆ దంపతులు చెబుతున్నారు.

ఇండోర్​కు చెందిన అభిషేక్ పాఠక్​, స్నేహల్ పాఠక్​ దంపతులు కెనడాలో నివసిస్తున్నారు.వినాయక చవితిని వినూత్నంగా నిర్వహించాలని భావించిన దంపతులు.. ఎల్లోరాలోని కైలాశ్ గుహ నమూనాను మండపంగా రూపొందించారు. దీని ఏర్పాటు కోసం జూన్​ నుంచి దాదాపు నాలుగు నెలల శ్రమించి.. కైలాశ్ గుహ నమూనాను రూపొందించారు. దీని తయారీకి అట్టలు, టీవీ డబ్బాలు, థర్మకోల్​, టిష్యూ పేపర్లను ఉపయోగించారు. కైలాశ్ గుహకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను చూసి దీనిని చెక్కారు. వినాయక చవితి వేడకులను వినూత్నంగా చేస్తూ.. దేశంలోని ప్రఖ్యాత ప్రదేశాలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఇలా చేశామని తెలిపారు పాఠక్ దంపతులు.