News

250 ఏళ్లనాటి రాధాకృష్ణుల విగ్రహాలు చోరీ

355views

అస్సోం రాష్ట్రంలోని గోల్పపరా జిల్లాలోని ప్రసిద్ధ బుడుచార్ సత్రం నుంచి 250 ఏళ్లనాటి రాధాకృష్ణుల విగ్రహాలు చోరికి గురయ్యాయి. విగ్రహాలతో పాటు ఇతర విలువైన ఆభరణాలను దొంగలు అపహరించారు. చోరీకి గురైన రాధమ్మ విగ్రహం వెండితో చేసింది కాగా కృష్ణయ్య విగ్రహాన్ని బంగారంతో తయారు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే వారు విగ్రహాలను బ్రహ్మపుత్రా నదిలో దాచారు.

నిందితులు ఇచ్చిన సమాచారంతో బ్రహ్మపుత్రా నదిలో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. గత నాలుగు రోజులుగా నదిలో గాలిస్తున్నా పురాతన రాధాకృష్ణుల విగ్రహాలు లభించలేదు. దీంతో గ్రామస్తులు సత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాల చోరీతో గోల్‌పరా జిల్లాలో విషాదం అలుముకుంది.