
539views
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రికి సర్వభూపాల వాహనసేవ నిర్వహించనున్నారు. శ్రీవారి వాహన సేవకు ముందు వివిధ కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.





