News

ఈరోజు తిరుమల శ్రీవారి అర్జితసేవా టికెట్ల విడుదల

329views

తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల డిసెంబర్ నెల కోటాను ఈ రోజు ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా సేవ టికెట్లను టిటిడి విడుదల చేస్తోంది.