News

మధ్యప్రదేశ్‌లో 108 అడుగుల శంకరాచార్యుల విగ్రహావిష్కరణ

MP Chief Minister Invites Intersex Activist To Inaugural Ceremony Of 108 Adi Shankara Statue At Omkareshwar - 1
349views

మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేడు ఆవిష్కరించారు. దాదాపు రూ.2100 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్యుల అష్టధాతువులతో రూపొందించిన ‘ఏకాత్మ ధామం’ కింద ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ఏర్పాటు చేశారు. దీనితో పాటు ‘అద్వైత లోక్’ పేరుతో మ్యూజియం, ఆచార్య శంకర్ ఇంటర్నేషనల్ అద్వైత వేదాంత ఇన్స్టిట్యూట్ కూడా నిర్మించారు. నేడు శివరాజ్ సింగ్ చౌహాన్ విగ్రహాన్ని ఆవిష్కరించి… అద్వైత ధామానికి శంకుస్థాపన చేసి భూమి పూజను చేశారు.