
225views
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన రామనవమి హింసాకాండపై కోల్‌కతా గురువారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ హింసాకాండ ఘటనపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. ఈ ఏడాది రామ నవమి సందర్భంగా హౌరా, హుగ్లీ, దల్‌ఖోలాలో జరిగిన హింసాత్మక ఘటనలపై కోల్‌కతా హైకోర్టు ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విచారణకు సంబంధించి అవసరమైన అన్ని పత్రాలను రెండు వారాల్లోగా జాతీయ దర్యాప్తు సంస్థకు అందజేయాలని కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించింది.పశ్చిమ బెంగాల్‌లో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే శుభేందు అధికారి పిల్‌పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.





