
పెద్దతిప్పసముద్రం పీటీఎంలో వెలసిన పార్వతీ సమేత విరూపా క్షేశ్వర స్వామి ఆలయం లో శివపార్వతుల కల్యాణం కమనీ యంగా జరిగింది. శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంతో పాటు ఆదిశంకరాచార్యుల జయంతి కావడంతో స్వామి వారికి విశేషపూజలు నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభిషే కం నిర్వహించి ఆదిశంకరాఇచార్యుల చిత్రప టానికి పూలమాలలు వేసి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం శివపార్వతులకు పీటీఎం కు చెందిన ఆధ్యాత్మిక వేత్త సనగరం పట్టాభి రామయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి కల్యాణాన్ని నిర్వహించారు. ఈకల్యాణాన్ని తిలకించేం దుకు పీటీఎంతో పాటు సమీప గ్రామాల ప్రజలు స్వామి వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయ సేవకుడు ఆకుల మల్లిఖా ర్జున తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా రామానుజ జయంత్యుత్సవం
రామస ముద్రం మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రామనుజ జయంతి వేడుకలు మం గళవారం వైభవంగా నిర్వహించారు. ఈ జయంతి సందర్భంగా రామానుజ స్వామి వారికి అర్చకులు కులశేఖర్ భట్టార్ ఆధ్వర్యంలో అభిషేకాలు, పూజ లు, మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
వైభవంగా ఆదిశంకరాచార్యుల జయంతి
ఆది శంకరాచార్యుల జయంతిని మదనపల్లె శం కర బ్రాహ్మణ సేవా సహ కార సమితి అధ్యక్షుడు వి. కొదండ రామయ్య ఆధ్వ ర్యంలో వైభవంగా నిర్వ హిం చారు. మంగళవారం పట్టణం లోగల కురవంకలోని బ్రాహ్మ ణ సేవాసంఘం కార్యాలయంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వ హించారు. ఇందులో భాగంగా శంకర రామానుజ చార్యుల వారి చిత్ర పటానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో టూ డిపో మేనేర్ నిరంజనను దుశ్శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు జ్ఞానో దయ ప్రసాద్, ప్రకాష్‌రావు, యుటీఎఫ్ మధుసూదనరావు. కేశవాచా ర్యులు, నరసంహాచార్యులు నాగభూషనరావు, తిరుపతిరావు, శ్రీనివాస శర్మ, ఎస్వీ రాఘవన, తదితరులు పాల్గొన్నారు.





