News

TTD: నేటి నుంచి అలిపిరిలో దివ్యదర్శన టోకెన్ల జారీ 

198views

తిరుపతి (తితిదే) తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఇప్పటివరకు గాలిగోపురం వద్ద ఇస్తున్న దివ్యదర్శన టోకెన్ల జారీ కేంద్రాన్ని తితిదే మార్పు చేసింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో శుక్రవారం నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం వద్ద ఉన్న కేంద్రంలో స్కాన్‌ చేసుకోవాలి. స్కాన్‌ చేసుకోకపోయినా, ఇతర మార్గాల్లో తిరుమల చేరుకున్నా.. స్వామివారి దర్శనానికి అనుమతించరు. శ్రీవారి మెట్టుమార్గంలో జారీ చేస్తున్న దివ్య దర్శన టోకెన్లను అక్కడే ఇస్తారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు జారీ చేస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల (ఎస్‌ఎస్‌డీ) కేంద్రాన్ని విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయానికి మార్చారు.