
191views
తమిళనాడులోని తేని జిల్లా కంభం ప్రాంతానికి చెంది న కమలకన్ని అనే శతాధిక వృద్ధురాలు చదువుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించింది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో పాసై అందరిని ఆశ్చర్యపరిచింది. రెండో తరగతి వరకు చదివిన కమలకన్ని కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి వలసవెళ్లి కూలీపనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగించేది. చిన్నప్పుడు పేదరికం కారణంగా ఆమె చదువుకోలేకపోయింది. 108వ పడిలో ఆమెకు చదువుకోవాలనే కోరిక కలిగింది. కేరళ ప్రభుత్వం నిరక్షరాస్యత నిర్మూలన కింద తమిళ, మలయాళ భాషలకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్న కమలకన్ని అక్కడి ప్రభుత్వ శిక్షణ సంస్థలో చేరింది. తమిళం, మలయాళం నేర్చుకుని, రెండు భాషల్లోనూ రాయగలుగుతోంది. ఈ పరీక్షల్లో ఆమెకు 100కి 97మార్కులు లొచ్చాయి. దీంతో ఇడుక్కి జిల్లా వండమేడు పంచాయతీ అధికారులు ఆమెను సత్కరించారు.





