News

సీఆర్‌ రావుకు అత్యున్నత పురస్కారం

244views

ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్‌) నిపుణుడు, భారతీయ అమెరికన్‌ కల్యంపూడి రాధాకృష్ణరావు(102) అలియాస్‌ సీఆర్‌ రావుకు స్టాటిస్టిక్స్‌ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్‌ అవార్డుగా భావించే ఇంటర్నేషల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ అవార్డు సీఆర్‌ రావును వరించింది. వచ్చే జులైలో కెనడాలో జరిగే కార్యక్రమంలో సీఆర్‌ రావు ఈ అవార్డును అందుకుంటారు. 1945లో కలకత్తా మ్యాథమెటికల్‌ సొసైటీలో ప్రచురితమైన సీఆర్‌ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. 1920లో కర్ణాటకలో జన్మించిన సీఆర్‌ రావుకు 1968లో పద్మభూషణ్‌ ఇచ్చిన భారత ప్రభుత్వం 2001లో పద్మ విభూషణ్‌తో గౌరవించింది.