News

మ‌హిళ‌ల‌ భాగస్వామ్యంపై ఆరెస్సెస్ దృష్టి

262views

రాష్ట్రీయ స్వయం సేవర్ సంఘ్ (ఆరెస్సెస్) ఇకపై చేపట్టే సామాజిక చైతన్య కార్యక్రమాల్లో మహిళా భాగస్వామ్యం పెంపుపై దృష్టి సారించనున్నట్లు సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య తెలిపారు. హరియాణాలోని సమాలబాలో ఆరెస్సెస్ మూడు రోజుల వార్షిక సర్వసభ్య సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో గత ఏడాదికాలంలో సంఘ్ పరివార్‌తోపాటు అనుబంద సంస్థల పనితీరు, చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించుకొని, వచ్చే ఏడాదికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని మన్మోహన్ వైద్య చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా స్వావలంబనకు ప్రాధాన్యమిస్తూ తీర్మానం చేస్తామన్నారు. మహిళలపరంగానూ ‘రాష్ట్రీయ సేవికా సమితి’ పేరిట తమకు ఓ బలమైన విభాగం ఉన్నట్లు ఆయన తెలిపారు.

సంఘ్ అతి చిన్న విభాగమైన శాఖలను వచ్చే ఏడాదికల్లా లక్షకు పెంచాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఈ శాఖల్లో దాదాపు 60% విద్యార్థులు ఉండగా.. మిగతా ఉద్యోగులు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు వివరించారు. 2017-2022 మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా 7.25 లక్షల యువత నుంచి సంఘ్ లో చేరేం: దుకు ఆసక్తి చూపుతూ ఆరెస్సెస్ వెబ్‌సైట్‌కు విజ్ఞాపనలు. వచ్చినట్లు మన్మోహన్ వైద్య వెల్లడించారు.

సోషలిస్టు నేతలకు సంఘ్ నివాళి..
సోషలిస్టు నేతలుగా పేరొందిన సమాజ్ వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తోపాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ కు ఆరెస్సెస్ నివా ళులు అర్పించింది. వీరితోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీకి సైతం శ్రద్ధాంజలి ఘటించింది. హరియాణాలోని సమాలబాలో జరుగుతున్న సంఘ్ వార్షిక సమావేశంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల దివ్యస్కృతికి నివాళులు అర్పించారు. గత ఏడాది కాలంలో దివంగతులైన ముఖ్య వ్యక్తులతోపాటు ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు గాయని వాణి జయరాం, బాలీవుడ్ నట- దర్శకుడు సతీశ్ కౌశిక్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. సమావేశాల ప్రారంభంలో ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే దివంగత ప్రముఖుల పేర్లు చదివి వినిపించారు. సంఘ్ పరివార్, అనుబంధ సంస్థల ప్రతినిధుల పేర్లును కూడా ఆయ‌న చ‌దివారు.