News

కమనీయం..లక్ష్మీపతి కల్యాణం

302views

కర్నూలు జిల్లా హంద్రీ తీరాన కొలువుదీరిన గోరంట్ల లక్ష్మీ మాధవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. ముందుగా ఎర్రగుడి వాసులు వరుడు మాధవస్వామి తరపున ప్రభను తీసుకుని మేళతాళాలతో హంద్రీనది మీదుగా ఆలయం చేరుకున్నారు. అనంతరం ఇరు గ్రామాల ప్రజలు స్వామి అమ్మవార్ల సమక్షంలో పురోహితులు కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్‌ స్వామి అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.