News

కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహ స్వామి దివ్యకల్యాణోత్సవాలు రేపే

178views

రాష్ట్రంలో నవనరసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహ స్వామి దివ్యకల్యాణోత్సవాలను మార్చి 2 నుంచి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతు న్నాయి.కల్యాణోత్సవాలు సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొండపైన, కొండదిగువన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కోరుకొండ గ్రామ పం చాయతీ, మండల పరిషత్‌ అధికారులు, రెవెన్యూ, పోలీ స్‌, విద్యుత్‌శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తు న్నా రు.స్వామి వారి రధానికి మరమ్మత్తులు, చలువు పందిళ్లు వేయడం, ఆలయానికి రంగులు వేయడం, ఉత్సవ మూర్తులను అలంకరించడం, కల్యాణమండపం అలంకరణ ఏర్పాట్లు, కొండ పొడవునా మెట్లకు రంగులు వేయడం, కొండపైన ఆలయంపై రంగులు అద్దడం, కొండపైన,కొండదిగువన భక్తులు క్యూలైన్ల భారీ కేడ్‌లు వంటి పనులు జోరుగా సాగుతున్నాయి.అదే విధంగా నిటారుగా ఉన్న స్వామి వారి కొండపైన విద్యుత్‌ దీపాలంకరణ పనులు సాగుతున్నాయి. కల్యాణోత్స వాలను తిలకించేందుకు వచ్చే యాత్రి కులందరికీ రెడ్డిపంతుల సత్రంలో అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను అన్నవరం దేవస్థానం కార్య నిర్వహణాధికారి పర్యవేక్షిస్తున్నారు. మార్చి 2వ తేదీ గురువారం నుంచి 8వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల వరకు స్వామి వారికి ద్వాదశ ప్రదక్షణలు, నివేదలతో శ్రీ పుష్ప యాగం చేస్తారు.