News

అంబరాన్నంటిన పాదాలమ్మ తల్లి సంబురం

204views

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పరిధిలోని సత్యవరంలో పాదాలమ్మ తల్లి గ్రామదేవత ఉత్సవం అంబరాన్ని తాకింది. గత నాలుగు రోజులుగా వేడుకలు జరుగుతుండగా.. మంగళవారం సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు బ్రాహ్మణ వీధి నుంచి సిరిమానోత్సవం ప్రారంభమైంది. సిరిమానును పురోహితుడు సూర్యనారాయణ అధిరోహించారు. అశేష భక్తజనం నడుమ మంగళవాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ సిరిమాను సాగింది. ఎటువంటి సంఘటనలు జరుగకుండా ఏఈ కోట్టేశ్వరరావు ఆధ్వర్యంలో ముందస్తుగానే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పోలీసులు క్రమబద్ధీకరించారు. బంధువులు, స్నేహితుల రాకతో సత్యవరం కిక్కిరిసిపోయింది.