News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

194views

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) స్వామివారిని 62,101 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 25,896 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.