News

గంగా, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తులకు అవభృతోత్సవం

205views

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి ఉత్సవాలు ముగిశాక శాస్త్రోక్తంగా గంగా, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తులకు దేవస్థానం అర్చకులు కృష్ణానదిలో సోమవారం అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండపై నుంచి మేళతాళాలు, వేదమంత్రాల మధ్య ఉత్సవమూర్తులను దుర్గాఘాట్‌ వద్దకు తీసుకొచ్చి, ఉపచారాలు చేశాక వేదమంత్రాల మధ్య ఉత్సవ మూర్తులకు నదీజలాలతో అవభృధ స్నానం చేయించారు. భక్తులు, దేవస్థానం అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.