News

నేటి నుంచి గురు వైభవోత్సవాలు

254views

మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలు 21 నుంచి 26 వరకు జరగనున్నాయి. మొదటిరోజు మంగళవా రం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు, పీఠాధిపతి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రెండో రోజు బుధవారం 402వ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరగనుంది. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఊంజల మంటపంలో బంగారు సింహాసనంపై రాఘవేంద్రస్వామి బంగారు పాదుకలను ఉంచి ముత్యాలు, రజత, బంగారు నాణేలు, క్షీరాభిషేకం, విశేష పుష్పాలతో అభిషేకం చేస్తారు. ఉత్సవమూర్తి ప్రహ్లా దరాయలను వివిధ రథాలపై ఊరేగించనున్నారు. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహ మూర్తి, ఈఈ సురేష్‌ కోణాపూర్‌, ఏఈ బద్రినాథ్‌లు ఏర్పాట్లను పూర్తి చేశారు.