పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పాల ధర రూ.250, కేజీ చికెన్ రూ.780కి చేరాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థపై ఆ దేశ నేతలు స్పందించలేదు. కానీ తాజాగ పాకిస్థాన్ ఇప్పటికే దివాళా తీసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు.”పాకిస్థాన్ దివాలా తీసింది.
‘ఇక్కడి అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహిస్తారు. మా సమస్యలకు పరిష్కారం దేశంలోనే ఉంది. ఐఎంఎఫ్ వద్ద పాకిస్తాన్ సమస్యలకు పరిష్కారం లేదు.” సియాల్‌కోట్‌లో జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి బ్యూరోక్రసీ, రాజకీయ నాయకులే కారణమని ఆసిఫ్ ఆరోపిస్తూ.. తన 33 ఏళ్ల పార్లమెంట్‌లో జీవితంలో ఇప్పుడే దేశంలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం ద్వారా ఆర్థిక లోటును నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ సంస్థలలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారీ పొదుపు చర్యలను ప్రకటిస్తారని కూడా ఆసిఫ్ చెప్పారు.