
భారతదేశంలో చీతాల సంఖ్యను విస్తరించడానికి దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు శనివారం ఉదయం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గో విమానంలో గ్వాలియర్ విమానాశ్రయానికి వచ్చాయి. ఈ చీతాలకు స్వాగతం పలికిన అధికారులు వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు విమానంలో మధ్యప్రదేశ్‌కు బయలుదేరాయి. చిరుతలను తీసుకువస్తున్న విమానం శనివారం ఉదయం 10 గంటలకు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ అయింది.
ఆఫ్రికన్ చీతాల కోసం కునో నేషనల్ పార్క్‌లో 10 క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లు సృష్టించినట్లు అధికారులు తెలిపారు.గతంలో నమీబియా దేశం నుంచి 8 చీతాలను కునో నేషనల్ పార్కుకు తీసుకువచ్చారు. చిరుతలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌లు కునో నేషనల్ పార్క్‌లోని వారి క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలోకి విడుదల చేస్తారు.





