News

రోడ్లపైకి భారతదేశ మొదటి ఏసీ డబుల్‌ డెక్కర్‌ ఈ-బస్సు రాక!

264views

మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ ఇ-బస్సును ముంబయి నగరంలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివరి నాటికి డబుల్ డెక్కర్ ఈ-బస్సుల సంఖ్య 200కి చేరనున్నాయి. దీంతోపాటు మరో ఐదు డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ ఇ-బస్సులు 10 రోజుల్లో రోడ్లపైకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సును ముంబయిలోని బెస్ట్ ఫ్లీట్‌లో చేర్చినట్లు అధికారులు తెలిపారు.

మొత్తం 20 బస్సులను నడుపనున్నట్లు బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) అండర్‌టేకింగ్ జనరల్ మేనేజర్ లోకేష్ చంద్ర తెలిపారు. కొత్త బస్సుల్లో డిజిటల్ టికెటింగ్, సీసీటీవీ కెమెరాలు, లైవ్ ట్రాకింగ్, డిజిటల్ డిస్‌ప్లే, అత్యవసర పరిస్థితుల కోసం పానిక్ బటన్ వంటి సదుపాయాలు ఉన్నాయి.ఈ బస్సుల ఛార్జీలు సింగిల్ డెక్కర్ ఏసీ బస్సులకు వర్తించే ఛార్జీలే ఉంటాయి. డబుల్ డెక్కర్ ఇ-బస్సుల ప్యాసింజర్ వాహక సామర్థ్యం వాటి సింగిల్ డెక్కర్ కౌంటర్‌పార్ట్‌లతో పోలిస్తే దాదాపు రెట్టింపు. కొత్త బస్సుల్లో 65 మంది సీటింగ్ కెపాసిటీ. నిలబడి ఉన్న ప్రయాణికులతో కలిపి 90 నుంచి 100 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.డబుల్ డెక్కర్ ఇ-బస్సుల లైన్ ఉత్పత్తి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని పాతాళగంగలో వర్క్‌షాప్‌లో చేస్తున్నారు.