
ఆంధ్రా – ఒడిశా రాష్ట్రాల్లోని గిరిజనుల ముఖ్య పండుగ అయిన ముత్యాలమ్మ తల్లి(బడాయాత్ర) జాతర ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా సబ్ కలెక్టర్ అక్షయ్ కుమార్, అడిషనల్ ఎస్పీ బలభద్ర, ఇంటెలిజెన్స్ డీఎస్‌వీ జోధానల్ బృందం మంగళవారం తూర్పగోదావరి జిల్లాలోని పొల్లూరు జలపాతాన్ని సందర్శించింది. వేలాది మంది భక్తులు కోసం జలపాతం వద్ద ఏర్పాట్లు, అలాగే సీలేరు నది వద్ద అమ్మవారు పడవ దాటే ప్రదేశాన్ని పరిశీలించి పలు సూచనలు అందించారు. ఈ వారంలో తూగో జిల్లాలోని చింతూరు మండలంలో ఉన్న ఐటీడీఏలో సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అధికారులతో, ఏపీ జెన్కో అధికారులతో మాట్లాడి తదుపరి జాతర ఏర్పాట్లపై కార్యాచరణ తెలియజేస్తామని, అలాగే సీలేరు నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు ఒక సంవత్సరంలోపు పూర్తి చేస్తామని ఒడిసా అధికా రులు తెలియజేశారు. ఒడిసా అధికారులకు మర్యాదపూర్వకంగా చింతూరు ఎంపీడీవో రవిబాబు, సర్పంచ్ ఆకేటి సీత, సెక్రటరీ రవినాయక్, మోతుగూడెం, పొల్లూరు జాతర కమిటీ సభ్యులు మల్లికార్జున, వరప్రసాద్, జెన్కో ఉద్యోగులు సూరినీడి నాయుడు, కాళ్ళ రామకృష్ణ, కరణం శ్రీను బాబు అధికారులకు స్వాగతం పలికి పొల్లూరు శివాలయంలో సన్మానం చేశారు. మల్కాన్‌గిరి కలిమెల తహసీల్దార్ సబీర్షా పాల్గొన్నారు.





