News

శ్రద్దావాకర్‌ హత్య కేసు చార్జిషీట్‌పై సాకేత్ కోర్టులో నేడు విచారణ!

220views

దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై దాఖలైన చార్జిషీట్‌ను సాకేత్ కోర్టు మంగళవారం నాడు విచారణకు స్వీకరించింది. ఛార్జిషీటు ప్రతిని నిందితుడికి అందజేశారు. డాక్యుమెంట్ల పరిశీలన కోసం తదుపరి విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లా వాయిదా వేశారు. కోర్టు హాలులోకి అఫ్తాబ్‌ను పోలీసులు హాజరుపరచి, రహస్యంగా విచారణ జరిపారు. మీడియాను లోపలకు అనుమతించ లేదు. అఫ్తాబ్‌ను కోర్టు ముందు హాజరుపరచే ముందు కోర్టు ప్రాంతాన్ని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. అఫ్తాబ్‌పై ఢిల్లీ పోలీసులు 6629 పేజీల ఛార్జిషీటును ఢిల్లీ పోలీసులు జనవరి 24న నమోదు చేశారు. అనంతరం అఫ్తాబ్‌ను జ్యుడిషియల్ కస్టడీ గడువు ముగుస్తుండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దీనికి ముందు, తన లాయర్‌ ఎంఎస్ ఖాన్‌ను మార్చాలని కోర్టును అఫ్తాబ్ కోరాడు. అఫ్తాబ్‌పై ఐపీసీలోని 302, 201 సెక్షన్ల కింద, ఇతర సెక్షన్ల కింద పోలీసులు ఛార్జిషీటు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయిన 90 రోజుల్లోపే ఛార్జిషీటు నమోదు చేయాల్సి ఉండటంతో కోర్టుకు ఇటీవల చార్జిషీటు సమర్పించారు. అఫ్తాబ్‌పై జరిపిన నార్కో అనలిస్ట్ పరీక్ష, పాలీగ్రామ్ పరీక్ష, డీఎన్ఏ సాక్షాలను కూడా ఛార్జిషీటులో చేర్చింది. పలువురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని, తాము సేకరించిన వీడియో, ఆడియోలను కూడా కోర్టుకు అందించారు.