News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా బాల మేలా.. ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు

345views

బాల సంస్కార కేంద్రాల వార్షికోత్సవం నెల్లూరు జిల్లా కావలిలో పీఎస్‌ఆర్‌ ట్రస్ట్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సామూహికంగా మత్స్య గాయత్రి మంత్రము, ప్రార్థన శ్లోకాలు, యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధి సుమారు 5 మండలాల నుంచి 36 గ్రామాలకు చెందిన పిల్లలు 750 మంది, 197 మంది తల్లిదండ్రులు, 136 మంది గ్రామపెద్దలు, కమిటీ మెంబర్లు మొత్తం1087 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బాల మేలాలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, అభినయ గేయాలు, దేశభక్తి గీతాల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు&ఎన్‌ఎఫ్‌డీబీ డైరెక్టర్ K. పోలయ్య, మురళి కృష్ణ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్‌ మురళి కృష్ణ, విశ్రాంత ఐఏఎస్‌ పి. కృష్ణయ్య, రామ కృష్ణ సహ ప్రాంత వ్యవస్థ ప్రముఖ్), ఒంగోలు జిల్లా డీఆర్‌వో ఓబులేసు, సంఘటన కార్యదర్శి రంగనాయకులు, శ్రీ రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్‌ వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.