News

వైభవంగా లక్ష దీపార్చన

309views

భీష్మ ఏకాదశి సందర్భంగా బుధవారం సాయంత్రం నర్సీపట్నంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధనను నేత్ర పర్వంగా నిర్వహించారు. ప్రముఖ చిత్రకారుడు ముత్యాల చంద్ర.. ఉప్పు, ముగ్గు, రంగులు ఉపయోగించి తపస్సు చేస్తున్న పరమేశ్వరుడు(150 అడుగులు), శంఖం, ఢమరుకం, త్రిశూలం ఆకృతులను రూపొందించారు. అనంతరం భక్తులు ప్రమిదల్లో నూనె పోసి, ఒత్తులు వేసి వెలిగించారు. శ్రీషిరిడీసాయి సేవా సమాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖలతోపాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.