News

అహోబిలం ఆలయ వివాదంలో ఏపీకి చుక్కెదురు… సుప్రీం కోర్టు ఏమందంటే?

154views

కర్నూలులోని అహోబిలం ఆలయ వివాదంపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అహోబిలం ఆలయ వ్యవహారాలను నియంత్రించడానికి, నిర్వహించడానికి ‘ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో) ని నియమించాలను రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగంలోని 26(డి)ని ఉల్లంఘించడమేనని, మఠాధిపతి పరిపాలనా హక్కును ప్రభావితం చేయడమేనని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించబోమని శుక్రవారం తెలిపింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోమని జస్టిస్‌ సంజయ్ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎఎస్‌ ఓకాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. మఠం సాధారణ కార్యకలాపాలతో ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలనుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. ఆలయాలను, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని, ప్రభుత్వ జోక్యం అవసరం లేదని వ్యాఖ్యానించింది. అహోబిలం మఠంలో ఇఒ నియామకాన్ని తప్పుబట్టిన రాష్ట్ర హైకోర్టు హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది.

సోర్సు – నిజం టుడే