149
ఉత్తర భారతదేశంలో బసంత పంచమి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. మాఘమేళాలో భాగంగా లక్షలాదిమంది భక్తులు గంగా, సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. బసంత్ పంచమి సందర్భంగా సరస్వతీ దేవికి పూజలు చేశారు. ప్రయాగరాజ్ నగరంలో మాఘమేళాలో భాగంగా గంగా, యమునా నదుల సంగమం వద్ద భక్తులు ఆవు పేడను కాల్చి పవిత్ర స్నానాలు చేశారు. సీసీటీవీ, బాడీ, డ్రోన్ కెమెరాల ద్వారా భక్తులను పర్యవేక్షించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 32 లక్షల మంది భక్తులు గంగా నది సంగమంలో స్నానాలు చేశారని అదనపు మేళా అధికారి వివేక్ చతుర్వేది తెలిపారు.