News

శ్రద్దవాకర్‌ను అందుకు చంపా.. వాంగ్మూలంలో సంచలనాలు వెలుగులోకి!

86views

దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా హత్య కేసులో ఆరు వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చార్జిషీట్లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా తన బాయ్ ఫ్రెండ్ ని కలిసినందుకే హతమార్చడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సుమారు 6,629 పేజీల చార్జీషీట్లో శ్రద్ధా తన స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్లిందన్న కోపంలోనే అఫ్తాబ్ ఈ దారుమైన ఘటనకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అఫ్తాబ్ కి శ్రద్దా తన స్నేహితుడిని కలవడం నచ్చలేదని, పైగా విషయమై తీవ్ర ఆందోళన చెందినట్లు.. నివేదికలో తెలిపారు. దీంతోనే ఆమెను అంత క్రూరంగా చంపేశాడని చార్జిషీట్ లో పేర్కొనట్లు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మీను చౌదరి వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని మెహౌలిలో ఉండే అఫ్తాబ్ తన భాగస్వామి శ్రద్ధావాకర్ని హత్య చేసి, 36 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఆ తదనంతరం శ్రద్దా కనపడకపోవడం, ఆ విషయాన్ని స్నేహితులు శ్రద్ధా తండ్రికి చెప్పడంతో ఆయన ఫిర్యాదు మేరకు అఫ్లాట్ని అరెస్టు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.