News

రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరు విద్యార్థినుల భరతనాట్య ప్రదర్శనకు ఎంపిక

44views

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరుకు చెందిన నృత్యపాఠశాల విద్యార్థినులు భరతనాట్యాన్ని ప్రదర్శించనున్నారు. కోయంబత్తూరు సమీపం పోత్తనూరులోని నృత్యశిక్షణ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థినులు రిపబ్లిక్‌డే వేడుకల్లో నృత్య ప్రదర్శనకు ఎంపికయ్యారు. నాలుగు రౌండ్లుగా నిర్వహించిన పోటీల్లో వీరు ప్రతిభ ప్రదర్శించి ఎంపికయ్యారని ఆ నృత్యశిక్షణ పాఠశాల నిర్వాహకులు మీనాక్షిసాగర్‌ తెలిపారు. మొదట తమ పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఢిల్లీలోని రిపబ్లిక్‌డే సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణ కమిటీ పరిశీలనకు పంపామని, ఆ తర్వాత తంజావూరులో జరిగిన దక్షిణ భారత స్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎంపికయ్యారని, చివరగా ఢిల్లీలో జరిగిన నాలుగో విడత పోటీల్లోను ఎంపికై రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రదర్శనకు అర్హత సాధించారని ఆమె వివరించారు. ఈ పదిమందిలో అయిదుగురు ఉద్యోగం చేస్తున్నారని, నలుగురు చదువుతున్నారని, ఒక యువతి తమ సంస్థలో శిక్షణ పొందుతోందని ఆమె తెలిపారు. తమ సంస్థకు చెందిన విద్యార్థినులు రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొనడం తనకెంతో గర్వకారణంగా ఆనందంగాను ఉందని ఆమె పేర్కొన్నారు.