News

అస్సాంలో 60 శాతానికి పడిపోయిన హిందూ జనాభా.. 40 శాతానికి పెరిగిన ముస్లింలు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ముస్లిం ఎమ్మెల్యే డిమాండ్‌!

386views

అస్సాంలోని ముస్లింల జనాభా ప్రస్తుతం 40 శాతానికి చేరిందని.. హిందువుల జనాభా 60 శాతానికి పడిపోయిందని.. జనాభా తామాషా ప్రమారం ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో అయిదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే కరీముద్దీన్‌ బర్భూయాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇటీవల ఆయన ఓ న్యూస్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో ముస్లిం జనాభా 40 శాతం ఉన్నందున వాస్తవాన్ని దాచాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా జనాభా సరళిని ప్రతిబింబించేలా రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. ఇది జరగకపోతే నష్టపరిహారం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
గతంలో తమ పార్టీ ఎమ్మెల్యే షెర్మాన్ అలీ లేవనెత్తిన ముస్లింలకు ఉద్యోగ రిజర్వేషన్ల డిమాండ్‌తో సీఎం హిమంత బిశ్వశర్మ విభేదించారని ఆయన అన్నారు. ఇలాంటివి పునరావృతం అయితే.. వలస వచ్చిన ముస్లిం విద్యార్థి సంఘం ఏఏఎంఎస్‌యూ ఆధ్వర్యంలో త్వరలో భారీ నిరసన చేపట్టి.. రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఏఏఎంఎస్‌యూ సంఘ విద్యార్థులు సుమారు ఒక కోటి యాభై లక్షల మంది ఉన్నారని వారందరూ రోడ్లపైకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఎంటో ముఖ్యమంత్రి గ్రహించాలని ఆయన సూచించారు. అలాంటి భయానక పరిస్థితులు సృష్టించేందుకు తాము ఏమాత్రం వెనుకాడమని పేర్కొన్నారు. అవసరమైతే రోడ్లపైనే ఇళ్లు నిర్మించుకుని ఉంటామని ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే కరీముద్దీన్‌ బర్భూయాన్‌ హెచ్చరించారు.