
323views
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమానం అత్యవసర పరిస్థితుల్లో అసోంలో ల్యాండ్ అయింది. అగర్తలకు ఆయన వెళ్తుండగా… వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల గువాహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బుధవారం రాత్రి అత్యవసర ల్యాండింగ్ కారణంగా ఆయన గువహటిలోనే బసచేయనున్నారు. గురువారం ఉదయం గువాహటి నుంచి అగర్తలా వెళ్లనున్నారు. ఈ సందర్బంగా షాకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. గురువారం అగర్తలాలో జరగబోయే రథయాత్రను షా ప్రారంభించనున్నారు.





