142
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో పర్యటనలో భాగంగా జనవరి 8న షా ఏపీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు ఆయన కీలక దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే బహిరంగసభలోనూ మాట్లాడబోతున్నారు. ఏపీలో అమిత్ షా పర్యటన జనవరి 8న ఒక్కరోజు మాత్రమే కొనసాగనుంది. జనవరి 8న తొలుత కర్నూలుకు చేరుకోనున్న అమిత్ షా, అనంతరం.. పుట్టపర్తిలోనూ పర్యటించనున్నారు. ఈక్రమంలో జనవరి 8వ తేదీ ఉదయం 11.15 గంటలకు కర్నూల్లో అమిత్ షా బహిరంగసభ ఏర్పాటు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించి అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఈ సభ ముగియగానే మధ్యాహ్నం భోజనం ముగించుకుని శ్రీ సత్యసాయి జిల్లాకు షా వెళ్లనున్నారు.