‘ఇస్లాంలోకి మారి పెళ్ళి చేసుకో.. లేదంటే రేప్ వీడియోను సోషల్ మీడియాలో పెడతా’… ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం యువకుడి దారుణం!

లక్నో: ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న ఓ మహిళను గన్తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అనంతరం ఈ దారుణాన్ని వీడియో తీశాడు. మతం మార్చుకుని తనను పెళ్ళి చేసుకోమని మహిళను బెదిరించాడు. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ర్వహిస్తోంది. తరన్నమ్, గజాలా అనే ఇద్దరు మహిళలు.. బ్యూటీ పార్లర్కు వచ్చేవారు. అలా బాధితురాలితో వారిద్దరు పరిచయం పెంచుకున్నారు. ఓ సారి బాధితురాలిని తరన్నమ్ తన ఇంటికి తీసుకెళ్ళి బంధించింది. అప్పుడు ఆమె సోదరుడు అక్లీమ్.. బాధితురాలిని గన్తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని అతని ఇద్దరు సోదరీమణులు వీడియో తీశారు. బాధితురాలు మతం మార్చుకుని అక్లీమ్ను పెళ్ళి చేసుకోవాలని.. లేదంటే అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. వారి మాటలకు బెదిరిపోయిన బాధితురాలు.. అక్లీమ్తో వివాహానికి బలవంతంగా ఒప్పుకుంది.
బాధితురాలు తన నగలను నిందితుడికి ఇచ్చింది. మత్తుమందు ఇచ్చి నిందితుడు ఆమెను బరేలీ తీసుకెళ్ళి బలవంతంగా పెళ్ళి దస్తావేజుపై సంతకం చేయించుకున్నాడు. అనంతరం ఆగ్రాకు తీసుకెళ్ళాడు. అప్పుడు అక్లీమ్ సోదరులు షాదల్, విసల్ కూడా ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబరు 23న బాధితురాలు నిందితుల చెరనుంచి బయటపడి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.