News

విజయవంతంగా పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం

67views

శ్రీహరికోట: ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ద్వారా 9 ఉప గ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోనస్ ఆర్టిట్లోకి వాటిని పంపారు.

960 కేజీల ఓషన్‌ శాట్-6తో పాటు మరో 8 నానో శాటిలైట్లు ఇందులో ఉన్నాయి. భూటాన్‌కు చెందిన ఓ శాటిలైట్ ‘భూటాన్‌ శాట్’ కూడా ఇందులో ఉంది. శుక్రవారం ఉదయం 10:26 గంటలకు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ అర్ముగం రాజరాజన్ కౌంట్ డౌన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ తొమ్మిది ఉపగ్రహాలను రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లిందని తెలిపారు. ఉపగ్రహాలన్నింటినీ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టామని చెప్పారు. ఓషన్ షాట్ ఉపగ్రహం నిర్ధేశిత కక్ష్యలోకి చేరిందని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి