News

మోదీతో భేటీ తర్వాత రిషి కీలక నిర్ణయం… ఏటా 3 వేల మంది భారతీయులకు వీసా

242views

న్యూఢిల్లీ: యూకే వెళ్ళాలనుకునే భారతీయులకు బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. జి-20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో రిషి సునాక్ భేటీ అయిన కొద్ది గంటలకే యూకే ప్రభుత్వం ఈ ప్రకటన వెలువర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.

“యూకే-ఇండియా యువ నిపుణుల వీసా పథకాన్ని ప్రకటిస్తున్నాం. ఈ పథకం కింద భారత్‌కు చెందిన 18-30 ఏళ్ళ డిగ్రీ విద్యావంతులకు ఏటా 3000ల వీసాలు అందజేస్తాం. వారు యూకేకు వచ్చి రెండేళ్ళ వరకు ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది” అని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం నేడు ట్విటర్‌లో వెల్లడించింది. ఇరు దేశాల మధ్య వలస భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా ఈ పథకాన్ని ఆమోదించామని, దీని కింద ప్రయోజనం పొందిన తొలి దేశం భారత్‌ అని యూకే ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి