News

రైలులో ఇక నచ్చిన భోజనం

132views

న్యూఢిల్లీ: రైలు ప్రయాణాల్లో ఇకపై స్థానిక ఆహార పదార్థాలు అందుబాటులోకి రానున్నాయి. మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారికి అవసరమయ్యే వంటకాలు సహా, శిశువులు, ఆరోగ్య ప్రియుల కోసం ప్రత్యేక ఆహారాన్ని రైల్వే అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూ మార్చుకొనే వెసులుబాటును ఐఆర్‌సీటీసీకి కల్పిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

చిరుధాన్యాలతో చేసే స్థానిక ఉత్పత్తులనూ మెనూలో భాగం చేసుకోవచ్చని సూచించింది. పండగల వేళ ప్రత్యేక ఆహార పదార్థాలు సైతం విక్రయించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం రైల్వే బోర్డు ఆమోదించిన మెనూనే ఐఆర్‌సీటీసీ కొనసాగిస్తోంది. ముందుగా నోటిఫై చేసిన ధరల ప్రకారమే ప్రీపెయిడ్‌ రైళ్ళలో మెనూను ఐఆర్‌సీటీసీ నిర్ణయిస్తుందని తాజా నోట్‌లో రైల్వే బోర్డు వివరించింది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి